: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్!... కృష్ణా పుష్కరాలకు మరింత పెరిగిన భక్తజనం!
కృష్ణా పుష్కరాలకు తరలివస్తున్న భక్తుల సంఖ్య నేడు మరింతగా పెరిగింది. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజామునుంచే పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కృష్ణా నదికి పుష్కరాల కోసం తరలివస్తున్న భక్తులు... పుష్కర స్నానం అనంతరం నదీ తీరంలోని ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా పుష్కర ఘాట్లతో పాటు కృష్ణా నది తీరంలోని అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఫలితంగా అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.