: 200 మీటర్ల పరుగులోనూ సత్తా చాటిన ఉసేన్ బోల్ట్!... హ్యాట్రిక్ గోల్డ్ కొట్టేసిన జమైకా చిరుత!
రియో ఒలింపిక్స్ లో జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన ఈ జమైకా అథ్లెట్... కొద్దిసేపటి క్రితం ముగిసిన 200 మీటర్ల పరుగులోనూ సత్తా చాటాడు. 19.78 సెకన్లలోనే 200 మీటర్ల పరుగును పూర్తి చేసిన బోల్ట్... ప్రత్యర్థులు అందుకోలేనంత వేగంగా లక్ష్యం చేరాడు. వెరసి వరుసగా మూడు ఒలింపిక్స్ లలో 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆటగాడిగా అతడు రికార్డు పుటలకు ఎక్కాడు. తాజా స్వర్ణంతో అతడు హ్యాట్రిక్ గోల్డ్ సాధించినట్లైంది. ఈ ఒలింపింక్స్ లో ఈ స్వర్ణం అతడికి రెండోది.