: పీవీ సింధుకు ఖరీదైన కానుక!... రూ.60 లక్షల బీఎండబ్ల్యూ కారును ప్రకటించిన చాముండి!


రియో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకాన్ని ఖాయం చేసిన బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఖరీదైన కానుక అందనుంది. నిన్న రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో సత్తా చాటిన సింధు అలవోకగా విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సింధు విజయం సాధించిన వెంటనే అక్కడే ఉన్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్ ను ప్రకటించారు. భారత్ కు మరో పతకం ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. రియో ఒలింపిక్స్ నుంచి ఈ నెల 28న సింధు హైదరాబాదు చేరుకుంటుందని చెప్పిన చాముండి... ఆ మరునాడే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ కారును సింధుకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News