: విజయాన్ని సొంతం చేసుకున్న సింధు ...ఫైనల్లోకి దూసుకుపోయిన తెలుగు తేజం


రియో ఒలింపిక్స్ భారతదేశానికి మరోపతకాన్ని తెలుగు తేజం సింధు ఖాయం చేసింది. ఒలింపిక్ చరిత్రలో స్వర్ణాన్ని భారత్ కు అందించే దిశగా సింధు కీలక అడుగు వేసింది. బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో తెలుగు తేజం సింధు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరా పై 21-19, 21-10 తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్లో చేరిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ కు మరో పతకం ఖాయం చేసిన సింధు స్వర్ణానికి గురిపెట్టింది. రెండు సెట్లలో ఒకుహరా హోరాహోరీగా సింధుతో ఆడింది. టెక్నిక్ కాన్ఫిడెన్స్ తో ఆకట్టుకున్న సింధు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించింది.

  • Loading...

More Telugu News