: హైదరాబాద్ లో పీవీ సింధు నివాసం వద్ద సందడి


రియో ఒలింపిక్స్ లో భాగంగా సెమీ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో భారత షట్లర్ పీవీ సింధు తలపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సింధు నివాసం వద్ద సందడి నెలకొంది. సింధు కు విజయం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఆమె తండ్రి రమణ చెప్పారు. ప్రతిభపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయని, సింధు ఫైనల్ కు చేరుతుందని తాము ఆశిస్తున్నట్లు రమణ పేర్కొన్నారు. కాగా, మొదటి సెట్ ను కైవసం చేసుకున్న సింధు, రెండో సెట్ లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News