: బబిత కుమారి పరాజయం...రియో నుంచి స్టార్ రెజ్లర్ ఔట్


భారత మహిళా స్టార్ రెజ్లర్ బబిత కుమారి రియో ఒలింపిక్స్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 53 కేజీల ఫ్రీ స్టైల్ మహిళా రెజ్లింగ్ విభాగంలో పోటీ పడిన బబిత కుమారి గ్రీస్ రెజ్లర్ యారియా చేతిలో పరాజయం పాలయ్యారు. ఆరు నిమిషాల పాటు సాగిన బౌట్ లో యారియా చేతిలో 5-1 తేడాతో బబిత కుమారి పరాజయం పాలైంది. దీంతో పతకం తెస్తుందని ఆశించిన మరోస్టార్ రెజ్లర్ నిరాశపరిచింది.

  • Loading...

More Telugu News