: ఎస్ బీఐ లో ఆరు బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)లో ఆరు బ్యాంకులు విలీనం కానున్నాయి. దేశంలో మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో బ్యాంకుల విలీనానికి ఎస్ బీఐ అంగీకారం తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐ లో విలీనం కానున్నట్లు అధికారులు తెలిపారు.