: విశాఖలో నితిన్ గడ్కరీ పర్యటన
విశాఖపట్టణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన కేంద్ర మంత్రికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశాఖ పోర్టులోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం షీలానగర్ లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ కేంద్రానికి ప్రత్యేకమని అన్నారు.