: సోషల్ మీడియా ఉండగా, మెయిన్ మీడియాతో పనేంటి?: సుబ్రహ్మణ్యస్వామి


సోషల్ మీడియా ఉండగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పనేంటని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉన్న స్వామి మళ్లీ ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. ట్విట్టర్ లో కూడా కాంగ్రెస్ పై విమర్శలు మానలేదు. తనను బీజేపీ మౌనంగా ఉండమని ఆదేశించిందని, అందుకే మౌనంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, తనపై దుష్ప్రచారంలో కాంగ్రెస్ శకుని పాత్ర పోషిస్తోందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో స్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ ట్విట్టర్ సాక్షిగా పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News