: ‘భారత ఆక్రమిత కశ్మీర్‌’ అంటూ వ్యాఖ్యానించిన దిగ్విజయ్ సింగ్... విమర్శల వర్షం!


కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ భారత ఆక్రమిత కశ్మీర్ అని వ్యాఖ్యానించారు. ఆయన నోటినుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్యని ప‌ట్టేసిన నెటిజ‌న్లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కూడా స్పందించారు. దిగ్విజ‌య్ సింగ్ భారత ఆక్రమిత కశ్మీర్ అంటున్నారని ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇలా దిగ్విజ‌య్‌ వ్యాఖ్యానించ‌డం ఆయన పాకిస్థానీ సోదరీమణులకు రాఖీ బహుమతి అందించిన‌ట్లుందని పరేష్ రావల్ సెటైర్లు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమ‌ర్శలు కురిపిస్తోన్న క్ర‌మంలో దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి ఈ వ్యాఖ్య వ‌చ్చింది. పాక్‌పై న‌రేంద్రమోదీ మండిప‌డుతున్న తీరును దిగ్విజ‌య్ ఉటంకిస్తూ.. మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారని అన్నారు. మోదీ చూపిస్తోన్న ఈ శ్ర‌ద్ధ‌ను స్వాగతించాల్సిందే అంటూనే, భారతీయ కశ్మీరీలతో మోదీ చర్చలు జ‌ర‌ప‌డంలో శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని విమ‌ర్శించారు. మోదీ కశ్మీరీలలో నమ్మకాన్ని ప్రోది చేశామంటూ వ్యాఖ్యానిస్తున్నార‌ని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ప్ర‌జ‌లైన లేక భారత ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ప్ర‌జ‌లైనా న‌మ్మ‌కం పొందాలంటే చర్చల ద్వారానే సాధ్య‌ప‌డుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే వెంట‌నే ‘భారతదేశ కశ్మీర్’ గురించి తాను చెబుతున్నాన‌ని అన్నారు. మోదీ భార‌త్‌లో ఉన్న‌ క‌శ్మీర్‌ లోయ గురించి పట్టించుకోకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News