: కంప్యూటర్ లో సినిమా చూస్తూ ఉప ముఖ్యమంత్రి కంటబడ్డ ప్రభుత్వోద్యోగి
కంప్యూటర్ లో సినిమా చూస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలోని ఒక ప్రభుత్వాసుపత్రిని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగులు ఉన్న ఒక గదిలోకి వెళ్లగా అక్కడ ఒక ఉద్యోగి కంప్యూటర్ లో సినిమా చూస్తూ ఉండటాన్ని మనీష్ గుర్తించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఆ ఉద్యోగిపై సస్పన్షన్ వేటు వేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.