: కృష్ణా జిల్లాలో నిజామాబాద్ ఎంపీ.. హోదా విషయంలో ఏపీకి మద్దతుగా ఉంటామన్న కవిత
కృష్ణా జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరంలో నిర్వహించిన ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో నిజామాబాద్ ఎంపీ కవిత ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై స్పందించారు. ఏపీకి హోదా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. హోదా హామీని ఆనాడు పార్లమెంట్‌లో ఇచ్చారని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతికంగా సాధ్యం కాకపోతే రాజకీయంగానైనా నిర్ణయం తీసుకోవచ్చని కవిత పేర్కొన్నారు.