: కృష్ణానది జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ వాయిదా
కృష్ణా జలాల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఢిల్లీలో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అధికారులతో సమావేశమైంది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే నీటి వాటాలపై తమ వాదనలు వినిపించాయి. నిన్న తమ వాదనలు వినిపించిన కర్ణాటక ఈరోజు కూడా పలు అంశాలను వివరించింది. ఆ రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది నారీమన్ వాదనలు వినిపించారు. తెలంగాణ కూడా తమ వాదనలు వినిపించిన అనంతరం విచారణను వచ్చేనెల 7కు వాయిదా వేసింది.