: 8 సెకన్లలోనే సీన్ మార్చేశా!... రియోలో విజయం తర్వాత సాక్షి మాలిక్ కామెంట్!


ఆరంటే ఆరు నిమిషాల్లో ముగిసే మల్ల యుద్ధంలో కేవలం 8 సెకన్లలోనే మొత్తం సీన్ నే మార్చేశానంటోంది... రియోలో భారత పతకాల ఖాతాను తెరచిన సాక్షి మాలిక్. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన 58 కిలోల మహిళల రెజ్లింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీలో తొలి అర్ధభాగం, ఆ తర్వాత కూడా సాక్షి ప్రత్యర్థి ఐసులు టినిబెకోవా దాదాపుగా మ్యాచ్ ను గెలిచేసింది. అయితే మ్యాచ్ చివర్లో జూలు విదిల్చిన సాక్షి... ఉడుం పట్టు పట్టింది. దీంతో ఐసులు ఆ పట్టు నుంచి లేవలేకపోయింది. వెరసి సాక్షి విజేతగా నిలిచి రియోలో భారత పతకాల ఖాతాను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా తాను సాధించిన విజయంపై సాక్షి తనదైన శైలిలో కామెంట్ చేసింది. రెజ్లింగ్ పోటీ కేవలం ఆరు నిమిషాల్లో ముగిసే పోటీనేనని చెప్పిన ఆమె... ప్రత్యర్థి చేతిలోకి వెల్లిన మ్యాచ్ ను కేవలం 8 సెకన్లలోనే లాగేసుకున్నానని చెప్పింది. తన కోసం ఓ మెడల్ ఎదురుచూస్తోందని చెప్పిన ఈ హర్యానా రెజ్లర్... దానిని ఒడిసిపట్టేయడమే లక్ష్యంగా పోరు సాగించానని చెప్పింది.

  • Loading...

More Telugu News