: జగన్‌కు రాఖీ క‌ట్టిన ష‌ర్మిల‌.. త‌న ఫేవ‌రేట్ ఫెస్టివ‌ల్ అన్న వైసీపీ అధినేత


అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయ‌త‌కు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగ‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. భార‌తీయ‌ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండుగే త‌న ఫేవ‌రేట్ ఫెస్టివ‌ల్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. త‌న చెల్లితో రాఖీ క‌ట్టించుకుంటుండగా తీసిన ఓ ఫోటోను ఆయ‌న షేర్ చేశారు. త‌న సోద‌రీమ‌ణుల‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. చిరున‌వ్వు చిందిస్తూ త‌న సోద‌రితో జ‌గ‌న్ రాఖీ క‌ట్టించుకున్నప్పుడు తీసిన ఈ ఫోటో ఆక‌ట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News