: ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’కు నేను కట్టుబడి ఉన్నా: ప‌్రధాని మోదీ
మన నాయకుల నుంచి మనం చాలా నేర్చుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన నాయకుల నుంచి నేర్చుకున్న విషయాలను కార్యరూపంలోకి తెస్తూ ముందుకెళ్లాలని అన్నారు. బీజేపీ ఇచ్చిన నినాదం ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’కు తాను కట్టుబడి ఉన్నట్లు మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ కార్యకర్తలకు ఇప్పటికీ అనేక సవాళ్లు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొందని అన్నారు. బీజేపీని నిజమైన ప్రజాస్వామిక పార్టీగా ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధే తమ కర్తవ్యమని చెప్పారు.