: సింధు కోసం కదిలిన విశాఖ!... రియోలో పసిడి పతకం కొట్టాలని కాంక్షిస్తూ భారీ ర్యాలీ!


రియో ఒలింపిక్స్ లో కొడిగడుతున్న భారత పతకాలపై కొత్త ఆశను రేపిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు విజయాన్ని కాంక్షిస్తూ సాగర నగరం విశాఖ కదిలింది. నేడు జరగనున్న సెమీ ఫైనల్ లో విజయం సాధించడమే కాకుండా ఫైనల్ లోనూ సత్తా చాటి దేశానికి పసిడి పతకాన్ని తీసుకురావాలని కాంక్షిస్తూ విశాఖ వాసులు నేటి ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. ‘గో గోల్డ్ సింధు’ పేరిట పెద్ద పెద్ద బ్యానర్లు చేతబట్టుకుని విశాఖ వాసులు చేపట్టిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంటోంది. రియోలో సింధు తప్పనిసరిగా బంగారు పతకాన్ని సాధించి తీరుతుందని, ఆ సత్తా సింధులో ఉందని ర్యాలీ నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News