: కేంద్ర ప్రభుత్వ పాలసీలను నిరసిస్తూ ఒక్కరోజు సమ్మెకు దిగనున్న బ్యాంకర్లు
బ్యాంకర్లు మరోసారి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకానమిక్ పాలసీలను, కార్మిక వ్యతిరేక సంస్కరణలను నిరసిస్తూ బ్యాంకర్లు వచ్చేనెల 2న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. దీనిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు, రీజినల్ రూరల్, కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు పాల్గొననున్నారు. తమ డిమాండ్లపై కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన కేంద్ర కార్మిక యూనియన్ కన్వెన్షన్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, నేషనల్ జనరల్ బంద్ చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చిన్న బ్యాంకుల విలీనాలు సరియైన పధ్ధతి కాదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీ.హెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. అయితే ఈ పధ్ధతిని ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థిస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్స్ చిన్న బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు వస్తున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వం చట్టాలను సవరిస్తూ వర్కర్లు ట్రేడ్ యూనియన్ హక్కులు కోల్పోయేలా చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.