: కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత!... సోదరికి స్వీట్లు తినిపించిన తెలంగాణ మంత్రి!
దేశవ్యాప్తంగా నేడు రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తమ సోదరులకు యువతులు రాఖీలు కడుతున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయమే టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. కేటీఆర్ కు దగ్గరి బంధువైన మరో యువతితో కలిసి వచ్చిన కవిత... కేటీఆర్ కు రాఖీ కట్టారు. తన చేతికి రాఖీ కట్టిన కవిత, మరో యువతికి కేటీఆర్ స్వీట్లు తినిపించారు.