: చంద్రబాబు ఉన్న చోట కార్యక్రమాలు బాగానే ఉంటాయి!... రవిశంకర్ గురూజీ ఆసక్తికర వ్యాఖ్యలు!


కృష్ణా పుష్కరాల్లో స్నానమాచరించేందుకు నిన్న విజయవాడ చేరుకున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో కలిసి నిన్న రాత్రి హారతి కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా మాట్లాడిన రవిశంకర్ గురూజీ... చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే దానికి పురాతన విద్యను జోడించి చంద్రబాబు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. పుష్కరాల్లో పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఏపీ ప్రభుత్వం చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News