: రికార్డుల మోత మోగించిన సాక్షి మాలిక్!... అభినందనలు తెలిపిన ప్రధాని!


రియో ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్ పతకాల పట్టికలో చేరింది. రెజ్లింగ్ లో హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ సత్తా చాటి కాంస్య పతకాన్ని గెలవడంతో నిన్నటిదాకా పతకాల పట్టికలో కనిపించని భారత్ పేరు... ఒక్కసారిగా జాబితాలో కనిపించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రెజ్లింగ్ 58 కిలో ప్రీస్టయిల్ విభాగంలో జరిగిన పోటీలో సాక్షి మాలిక్ ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ విజయంతో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి రెజ్లింగ్ క్రీడాకారిణిగా మాలిక్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఒలింపిక్స్ లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగానూ మాలిక్ చరిత్ర సృష్టించింది. మాలిక్ విజయం సాదించిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడాకారులకు సాక్షి మాలిక్ మార్గదర్శకురాలిగా నిలిచిందని ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News