: పవన్ కల్యాణ్ సినిమా నిర్మాతను కూడా నయీమ్ బెదిరించాడా?
నయీమ్ కు సినీ పరిశ్రమతో వున్న సంబంధాలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మించిన ఓ నిర్మాతను నయీమ్ బెదిరించినట్టు తెలుస్తోంది. నయీమ్ బెదిరింపులకు భయపడి ఆ నిర్మాత 8.5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే కింది స్థాయి నుంచి వచ్చిన పలువురు నిర్మాతలను నయీమ్ బెదిరించినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఓ సినిమా తీయాలని నయీమ్ భావించినట్టు, అందుకోసం పలువురు దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇటీవలే నానక్ రామ్ గూడలో ఒక బిజినెస్ మ్యాన్ తో పలు డీల్స్ లో భాగం పంచుకున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ విషయాలపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.