: రియో ఒలింపిక్స్ లో భారత్ రెజ్లర్ కాలు విరిచేసిన చైనా రెజ్లర్
రియో ఒలింపిక్స్ లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ కాలు విరిచేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... 48 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ప్రిక్వార్టర్స్ లో రొమేనియాకు చెందిన ఎమిలియా అలినాపై 11-0 తో వినేష్ ఫొగట్ విజయం సాధించింది. దీంతో రెజ్లింగ్ లో భారతకు కూడా ఒక పతకం వస్తుందని క్రీడాకారులు ఆనందంలో మునిగి ఉన్న వేళ... క్వార్టర్ ఫైనల్స్ పోటీల్లో భారత్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడింది. తొలి బౌట్ లో సన్ యనన్ పట్టిన పట్టుకి వినేష్ ఫోగట్ కాలు విరిగిపోయింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆమె టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో చైనా రెజ్లర్ ను అంపైర్లు బౌట్ విజేతగా ప్రకటించారు. దీంతో ఆమె 1-2 పాయింట్ల ఆధిక్యంతో సెమీఫైనల్ లో ప్రవేశించింది. ఇదిలా ఉంచితే, వినేష్ ఫోగట్ కు రింగ్ లోనే ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు స్ట్రెచర్ పై ఆసుపత్రికి తరలించారు.