: రాధికా ఆప్టే పేరు మాత్రమే ఎందుకు పెట్టారు? నా పేరు ఎందుకు పెట్టలేదు?: సహ నటుడు ఆదిల్ హుస్సేన్


బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకు సహనటుడి మద్దతు దొరికింది. 'పర్చేద్' సినిమాలోని రాధిక నటించిన నగ్న దృశ్యాలు ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. దీనిపై ఆమె సహనటుడు ఆదిల్ హుస్సేన్ మాట్లాడుతూ, 'ఆప్టే లీక్డ్ సీన్స్' అని వాటికి పేరు పెట్టే బదులు, అందులో నటించిన తన పేరు ఎందుకు పెట్టలేదని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత కాలం మహిళలపై వివక్ష చూపిస్తారని ఆయన ప్రశ్నించాడు. ఒకవేళ ఆ సినిమాలో నటించడం రాధికా ఆప్టేది తప్పు అంటే, అందులో 50 శాతం తప్పు తాను కూడా చేసినట్టేనని, అలాంటప్పుడు తన పేరు ఎందుకు బయటకు రాలేదని ఆయన నిలదీశాడు. ఈ సీన్ లో తామిద్దరం నటించినా రాధిక ప్రతిష్ఠను కించపరిచేలా కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ సినిమాలో చాలా మంచి అంశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఇలాంటి సీన్స్ లీక్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మన ఆలోచనా విధానం ఇంకా మారకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించాడు. ఇద్దరూ కలిసి తప్పు చేసినప్పుడు అందులో మహిళను మాత్రమే ఎంతకాలం నిందిస్తారని ఆయన నిలదీశాడు.

  • Loading...

More Telugu News