: సింధుని కొత్తగా చూస్తున్నాను: తండ్రి రమణ
తన కుమార్తె సింధును ఇప్పుడు కొత్తగా చూస్తున్నానని ఆమె తండ్రి రమణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మ్యాచ్ ఆరంభం నుంచి పట్టువదలకుండా తను ఆడుతోందని అన్నారు. మరొక్క విజయం సాధిస్తే భారత్ గర్వించదగ్గ విజయం సాధించినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సింధు మరో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గోపీచంద్ లేనిదే సింధు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సింధు మాత్రమే కాదు, భారత దేశంలో బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎవరు పేరుతెచ్చుకున్నా వారి వెనుక గోపీచంద్ ఉన్నాడని ఆయన తెలిపారు. ఆటగాళ్ల పతకాల వెనుక గోపీ హస్తం తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. జపాన్ క్రీడాకారిణితో సింధు సెమీ ఫైనల్ లో తలపడనుందని, ఆమె కూడా పటిష్ఠమైన క్రీడాకారిణేనని ఆయన చెప్పారు. అయితే సింధు సహజశైలిలో ఆడితే భారత్ కు పతకం ఖాయమని ఆయన తెలిపారు. సింధు భారత్ కు పతకం తేవాలని ఆయన ఆకాంక్షించారు.