: భారత్, పాక్ చర్చల ద్వారానే కశ్మీర్ అంశానికి పరిష్కారం: ఒమర్ అబ్దుల్లా
కశ్మీర్లో కొనసాగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. 45 రోజులుగా అక్కడ పరిస్థితులు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. భారత్, పాక్ ల మధ్య చర్చల ద్వారానే కశ్మీర్ అంశానికి పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వ చర్యలకు తాము సహకరిస్తున్నామని చెప్పారు. అక్కడ మామూలు పరిస్థితులు తీసుకురావడానికి అవసరమైన చర్యలను భారత్, పాక్ చేపడతాయని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.