: హర్యాణా మంత్రిగారి నిర్వాకంపై సోషల్ మీడియాలో విమర్శలు
రియో ఒలింపిక్స్ కు భారత్ తరపున పోటీల్లో నిలిచిన రాష్ట్ర ఆటగాళ్లను ప్రోత్సహించడానికి వెళ్తున్నానని చెప్పిన హర్యాణా మంత్రి అనిల్ విజ్ కనీసం పోటీలకు హాజరుకాకపోవడం, ఆటగాళ్లను పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిల్ విజ్ ఎనిమిది మంది సభ్యుల బృందంతో కలిసి గత ఆదివారం బ్రెజిల్ వెళ్లారు. క్రీడాకారులను దగ్గరుండి ప్రోత్సహించేందుకు వెళ్తున్నానని ఆయన విమానం ఎక్కేముందు ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా స్థానిక భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ వేడుకల్లో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో కోటి రూపాయల ప్రజాధనాన్ని సరదాగా బ్రెజిల్ వెళ్లడానికి ఖర్చు చేశారా? అంటూ సోషల్ మీడియాలో పలువురు మంత్రిని విమర్శిస్తున్నారు.