: ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల రాళ్ల దాడులు...రామసుబ్బారెడ్డి వర్గీయులకు గాయాలు


కడప జిల్లాలో వర్గపోరు భగ్గుమంది. టీడీపీలోని వైరి వర్గాలుగా ముద్రపడిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. కొండాపురం మండలం కొత్తపల్లెలో చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో ఎమ్మెల్యే అనుచరులు మాజీ మంత్రి వర్గీయులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడి నుంచి వెనుదిరుగుతున్న వేళ, వారిపై ఎమ్మెల్యే వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇందులో రామసుబ్బారెడ్డి వర్గీయులు పది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News