: అమలాపాల్ బాటలో మరో సినీ నటి!
కోలీవుడ్ నటి అమలాపాల్ బాటలోనే దివ్య ఉన్ని కూడా నడుస్తోంది. ప్రేమ వివాహం చేసుకుని హాయిగా సెటిలైందని ఆమె అభిమానులు భావించేంతలో తమ ప్రేమ విఫలమైందని, విడాకులు తీసుకుంటున్నామని అమలాపాల్ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, గతంలో తెలుగులో వేణు తొట్టెంపూడితో కలిస 'ఇల్లాలు ప్రియురాలు' సినిమాలో నటించిన దివ్య ఉన్ని కూడా భర్త నుంచి విడిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏడవ ఏట నుంచే బాలనటిగా అలరించిన దివ్య ఉన్న 21వ ఏట సుధీర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని స్థిరపడింది. ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. కెరీర్ పేరిట కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, డ్యాన్స్ స్కూల్ మూసివేయాలని ఆమె భర్త సుధీర్ ఆమెను ఆదేశించగా, అందుకు ఆమె నిరాకరించిందని, దీంతో వారిద్దరి మధ్య విభేదాలు పెరిగి విడాకులకు దాఖలు చేసుకున్నారని అంటున్నారు. దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి సుధీర్ కు అక్రమ సంబంధం ఉందని, దీంతో భార్యా భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, అవి పెరిగి విడాకులకు దారితీశాయని, ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దివ్య ఉన్ని మళ్లీ తెలుగు, తమిళంలో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటోందని తెలుస్తోంది.