: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు... మణిపూర్ గవర్నర్ గా నజ్మా హెప్తుల్లా
మణిపూర్, అసోం, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి, గత నెలలో రాజీనామా చేసిన నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. భన్వారిలాల్ పురోహిత్‌ను అసోం గవర్నర్‌గా నియమించిన కేంద్ర ప్రభుత్వం, వి.పి.సింగ్ బద్నోర్‌ను పంజాబ్ గవర్నర్‌గా నియమించింది.