: విశాఖ జిల్లాలో బాణాసంచా తయారీలో పేలుడు!... ముగ్గురు దుర్మరణం, పలువురికి గాయాలు
విశాఖ జిల్లాలో కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఇంటిలో గుట్టుగా తయారు చేస్తున్న బాణాసంచా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. భారీ శబ్దంతో కూడిన పేలుడుతో సమీప ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకెళితే... జిల్లాలోని దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లిలో ఓ ఇంటిలో బాణాసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తక్షణమే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.