: నయీమ్ భార్య హసీనాబేగం, చెల్లెలు సలీమా బేగంను కస్టడీకి తీసుకున్న పోలీసులు
చేసిన పాపాలు పండి ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతితో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నయీమ్‌కి సంబంధించిన అన్ని అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి నయీమ్ భార్య హసీనాబేగం, చెల్లెలు సలీమా బేగంను షాద్ నగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారితో పాటు నయీమ్ బావమరిది అబ్జుల్‌మతిన్, మరో మహిళ ఖలీమా బేగంను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని నయీమ్‌కు సంబంధించిన నేరాలు, పలు అంశాలపై విచారిస్తున్నారు.