: ఇస్లాం వివాదాస్పద బోధకుడు జకీర్ నాయక్ ఈ ఏడాది భారత్‌కు వచ్చే అవకాశాలే లేవట!
వివాదాస్పద ప్రసంగాలతో ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, జకీర్ ప్రస్తుతం విదేశాల్లో వున్నాడు. అయితే, ఆయన ఈ ఏడాది భారత్‌కు వచ్చే అవకాశాలు లేవట. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత లాయర్ ముబిన్ సోల్కర్ స్వయంగా తెలిపారు. జకీర్ అరెస్టుకు భయపడి భారత్‌కు తిరిగి రావడం లేదనే అంశాన్ని ఆయన వ్యతిరేకించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జకీర్ నాయక్ విదేశీ పర్యటన కొనసాగుతోందని ముబిన్ సోల్కర్ పేర్కొన్నారు. అంతేకాదు, గతంలోనూ జకీర్ రెండు నెలల కొకసారి మాత్రమే భారత్‌కు వచ్చేవారని ఆయన తెలిపారు. జకీర్ నాయక్‌పై ఏ దర్యాప్తు సంస్థ కోర్టులో ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా గత నెలలోనే జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడ్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.