: నేడు క్వార్టర్ ఫైనల్ లో తలపడనున్న శ్రీకాంత్... అదృష్టాన్ని పరీక్షించుకునే భారత క్రీడాకారులు వీరే


రియో ఒలింపిక్స్ లో నేడు కొన్ని కీలక మ్యాచ్ లలో భారత ఆటగాళ్లు తలపడనున్నారు. ప్రధానంగా డిఫెండింగ్ చాంపియన్, చైనాకు చెందిన లిన్ డాన్ తో తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 5:50కి మొదలు కానుంది. లిన్ డాన్ పై విజయం సాధిస్తే, శ్రీకాంత్ సెమీస్ కు వెళ్తాడు. అంతకుముందు 4 గంటలకు మహిళల గోల్ఫ్ లో భాగంగా అదితీ అశోక్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడనుంది. మహిళ 58 కిలోల రెజ్లింగ్ లో 6:40కి షికా మాలిక్ స్వీడన్ కు చెందిన జొహానాతో తలపడనుండగా, రాత్రి 7:10కి వినీష్ పోగత్ 48 కిలోల విభాగంలో ఆడనుంది. రాత్రి 7:39కి మహిళ 800 మీటర్స్ హీట్ 3లో టింటూ లూకా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

  • Loading...

More Telugu News