: దత్తన్న ఆఫీస్ లో లంచాల కలకలం!... కార్మిక శాఖ ఓఎస్డీపై వేటు!


తెలుగు నేలకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కార్యాలయంలో భారీ ఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తు మొదలెట్టిన సీబీఐ.. ఆ వార్తలు నిజమేనని తేల్చింది. ఫలితంగా దత్తాత్రేయ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేస్తున్న శ్యామ్ వీర్ తాంక్ పై వేటు పడింది. వివరాల్లోకెళితే... ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో పనిచేస్తున్న రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ల జీతాల పెంపుకు సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలతో పాటు దత్తన్న ఓఎస్డీకి కూడా భారీగా లంచాలు అందజేశారట. దీనిపై ఈపీఎఫ్ఓకు చెందిన కొందరు సిబ్బంది చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగి అవినీతి తంతును నిగ్గు తేల్చింది. దీంతో తాంగ్ పదవి ఊడిపోయింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని సంచలనాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News