: నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే నయీమ్ ఎన్ కౌంటర్: దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు


గుజరాత్ లో సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగిన వేళ, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నయీమ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్ సర్కారు చంపేయించిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, గుజరాత్ ఎన్ కౌంటర్ లో అమిత్ షా దోషని, దానికి నయీమ్ సాక్ష్యమని అన్నారు. నయీమ్ వంటి వారు భారత రాజ్యాంగ వ్యవస్థనే సవాల్ చేసేలా ఎదగడానికి కారణం ప్రభుత్వాలు, పాలకులేనని విమర్శించారు. నయీమ్ ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణకు ఆదేశించి, ఆయన వెనకున్న నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వడ్లమూరి, ఆయన ఆక్రమించుకున్న ఆస్తులను తిరిగి బాధితులకు అందజేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News