: నా ప్రియమైన ప్రజలారా! కుక్క మాంసం శ్రేష్ఠమైనది...కడుపారా తినండి!: కొరియా చీఫ్
ఉత్తరకొరియా అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు వింటే మానవత్వమున్న వారికి పిచ్చెక్కిపోతుంది. విశ్వాసానికి ప్రతీకగా, మనిషికి చేదోడువాదోడుగా, మంచి స్నేహితుడిగా నిలిచే కుక్కపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను ఆగ్రహానికి గురి చేస్తే... కొరియన్లు మాత్రం సంబరపడిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, 'నా ప్రియమైన ప్రజలారా! కుక్క మాంసాన్ని కడుపారా తినండి. ఎందుకంటే...బీఫ్, చికెన్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్కమాసం ఎంతో బలవర్ధకమైనది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి' అని అన్నారని అక్కడి వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో అక్కడి మీడియా సంస్థలు కుక్క మాంసం గొప్పదనంపై వార్తా కథనాలు రాస్తున్నాయని 'ది కొరియా టైమ్స్' వెల్లడించింది. అయితే కిమ్ కంటే ఒక అడుగు ముందుకేసిన కొందరు వ్యక్తులు 'కుక్కలను మామూలుగా తిన్నప్పటి కంటే వాటిని బాధకు గురిచేసి చంపి తింటే మరింత రుచికరంగా ఉంటాయని చెబుతూ, అలా వాటిని హింసించి చంపి తింటున్న వీడియోలను యూట్యూబ్ లో పెడుతున్నారు.