: నర్సింగ్ యాదవ్ పోటీపై తొలగని ఉత్కంఠ


రియో ఒలింపిక్స్‌ లో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పాల్గొనే విషయంలో ఉత్కంఠకు తెరపడలేదు. డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆడేదీ లేనిదీ ఇంకా స్పష్టం కాకపోవడంతో, పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అతను అయోమయంలో పడిపోయాడు. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు షరన్ సింగ్ మాట్లాడుతూ, నర్సింగ్‌ యాదవ్ కు రియోలో మరోసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నారని, పోటీలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు అతని అర్హత వ్యవహారం తేలనుందని చెప్పారు. ఒలింపిక్స్ నేపథ్యంలో జులై 25న అతని నుంచి సేకరించిన రెండు శాంపిల్స్‌ పాజిటివ్‌ గా తేలిన సంగతి, దీనిపై పెనువివాదం రేగి, సద్దుమణిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News