: ఏపీ హామీలపై అరుణ్ జైట్లీని తీసుకుని రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన వెంకయ్యనాయుడు


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇంకా అమలు కాని హామీలపై ఈ ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై వీరి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశానంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు పెండింగ్ పనులపై రెండు వారాల్లో స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అన్నారు. ఈ మేరకు రాజ్ నాథ్ సింగ్ తనకు హామీ ఇచ్చారని వెంకయ్యనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News