: విడుదలైన నీట్ 1, 2 ఫలితాలు
నీట్ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ వైద్య విద్య అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలను సీబీఎస్ ఈ విడుదల చేసింది. మే 1, జూలై 24న రెండు దఫాలుగా నిర్వహించిన నీట్ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షకు సంబంధించిన ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ఈ ఫలితాలు ఆగస్టు 17న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఒకరోజు ముందే విడుదల చేయడం విశేషం. పరీక్షలు రాసిన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వైబ్ సైట్ ద్వారా తమ ర్యాంకులను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.