: శ్రీకాంత్, సింధు అల్ ది బెస్ట్...దీపా కర్మాకర్, లలితా బాబర్ శభాష్: జగన్


రియో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ లో చేరిన తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్ సింధు, శ్రీకాంత్ భారత్ కు పతకాలు తేవాలని ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లలో జిమ్నాస్టిక్స్ లో పతకంపై ఆశలు రేపిన దీపా కర్మాకర్, రిలేలో ప్రాతినిధ్యం వహించిన లలితా బాబర్ లు అద్భుత ప్రతిభను ప్రదర్శించారని అభినందించారు. కాగా, రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లంతా రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్న వేళ వీరిద్దరూ పతకం తెస్తే అది చరిత్రే అవుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా, వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. మరొక్క అడుగు విజయవంతంగా వేస్తే పతకం ఖాయం. రెండడుగులు వేస్తే చరిత్ర లిఖించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News