: యెమెన్‌లో ఛారిటీ ఆసుపత్రిపై బాంబు దాడులు.. 20 మంది మృతి


భీక‌ర దాడులు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉగ్ర‌వాదులు ప్ర‌తిరోజు ప్రపంచంలో ఏదో ఒక చోట దాడుల‌కు దిగుతూనే ఉన్నారు. ఆ క్రమంలో యెమెన్‌లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి రెచ్చిపోయారు. ఛారిటీ ఆసుప‌త్రే ల‌క్ష్యంగా దాడులు జ‌రిపారు. బాంబులతో విధ్వ‌ంసం సృష్టించారు. దీంతో 20 మంది రోగులు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత‌ప‌డ్డారు. దాడిలో ఆసుప‌త్రి సిబ్బంది స‌హా మరో 30 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌కు వైద్య స‌హాయాన్ని అందిస్తున్నారు. హౌతీ ఉగ్ర‌వాదులే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News