: భారత్ తో యుద్ధానికి సైన్యాన్ని పంపమన్న హఫీజ్ సయీద్


భారత్ తో యుద్ధానికి సైన్యాన్ని పంపాలని కరుడుగట్టిన తీవ్రవాద నేత జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ ఆర్మీని కోరాడు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని ఎన్‌ కౌంటర్‌ కు నిరసనగా 'కశ్మీర్ కారవాన్' పేరుతో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు వాహనాలతో పాక్ కేంద్ర మంత్రులు, ముస్లిం మతపెద్దలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్ సయీద్ మాట్లాడుతూ, పాక్ సైన్యాన్ని కాశ్మీర్‌ కు పంపి భారత్‌ కు గుణపాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌ ను కోరాడు. కాశ్మీర్ లో ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయని చెప్పాడు. మరణించిన కాశ్మీరీల త్యాగాలు వృథా కావని తెలిపాడు. కాశ్మీర్ లో వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని హఫీజ్ సయీద్ చెప్పాడు.

  • Loading...

More Telugu News