: సినిమాలు, టీవీల్లో అఘోరాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు: అఘోరా సాధువు
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నుంచి పుష్కరాలకు వచ్చిన అఘోర సాధువులు విజయవాడలోని ఫెర్రీ ఘాట్‌లో ఈరోజు శంఖం పూరిస్తూ పుష్కర స్నానం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలుగువాడైన అఘోర సాధువు రాజేశ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. సినిమాలు, టీవీల్లో తమను తప్పుగా చిత్రీకరిస్తూ చూపిస్తున్నారని, ప్రజల్లో తమపై ఏర్పడిన అపోహలు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కృష్ణా పుష్కరాల్లో స్నానం చేశామని ఆయన తెలిపారు. శవాలను అఘోరాలు ఆహారంగా మాత్రమే పరిగణిస్తారని ఆయన పేర్కొన్నారు.