: మరో పుష్కర అపశ్రుతి... బైక్ లో చున్నీ ఇరుక్కుని ఐటీడీఎస్ సూపర్ వైజర్ కల్పన మృతి
వైభవంగా జరుగుతున్న కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతులు దొర్లుతూనే ఉన్నాయి. పుష్కర ఏర్పాట్లను పరిశీలించేందుకు బైక్ పై వెనుక కూర్చుని వెళుతున్న గుడివాడ ఐటీడీఎస్ సూపర్ వైజర్ కల్పన దురదృష్టవశాత్తూ మరణించారు. మొవ్వలో పుష్కర ఏర్పాట్లు చూసేందుకు వెళుతున్న ఆమె చున్నీ బైక్ వెనుక చక్రంలో చుట్టుకుపోయి, వాహనం అదుపుతప్పగా, కిందపడి తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. అధికంగా రక్తస్రావం కావడం వల్లనే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.