: మోదీ వ్యాఖ్యల ప్రభావం.. గిల్గిత్‌లో నిరవధిక సమ్మెకు పిలుపు


భారత ప్రధాని నరేంద్రమోదీ గిల్గిత్‌ బాల్టిస్థాన్ వాసుల‌కు అనుకూలంగా ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. గిల్గిత్‌తో పాటు బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని మోదీ అన్నారు. దీంతో గిల్గిత్‌లో పాకిస్థాన్ తీరును ఖండిస్తూ చేస్తోన్న ఆందోళ‌న‌లు మరింత ఉద్ధృత‌మ‌య్యాయి. పాకిస్థాన్ ప్ర‌ధాని నవాజ్‌ షరీఫ్ స‌ర్కార్‌ తమ ప్రాంత హక్కులను కాలరాస్తోందని నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పాకిస్థాన్‌ నుంచి త‌మ‌కు విముక్తి కావాల్సిందేనంటూ గిల్గిత్‌ అవామీ యాక్షన్ కమిటీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News