: 'నాయక్' ఇచ్చాడు.. వినాయక్ పుచ్చుకున్నాడు
ఇద్దరమ్మాయిలతో ఆడియోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. తొలి సీడీనీ రామ్ చరణ్.. 'నాయక్' దర్శకుడు వినాయక్ కు అందించారు. ఆడియో ఆవిష్కరణకు చిత్ర తారాగణం అల్లు అర్జున్, అమలాపాల్, క్యాథరిన్, బ్రహ్మానందంతో పాటు, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గీత రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత బీవీఎస్ రవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కేఎస్ రామారావు, ఫైట్ మాస్టర్ కేచా తదితరులు పాల్గొన్నారు.