: తిరుమలలో ఘోర ప్రమాదం... బైక్ ను ఢీకొట్టిన బస్సు, దంపతుల మృతి


తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై కొండపై నుంచి దిగొస్తున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనగా, ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మొదటి ఘాట్ రోడ్డు 7వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రూయా ఆసుపత్రికి తరలించారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నామని, బైక్ నడుపుతున్న వ్యక్తి మలుపును సరిగ్గా అంచనా వేయక పోవడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. వీరు ఎవరు? ఎప్పుడు తిరుమలకు వచ్చారన్న విషయాన్ని విచారించి బంధువులకు సమాచారం ఇస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News