: రేపు ముంబైలో దావూద్ ఇబ్రహీం మేనల్లుడి పెళ్లి... స్కైపేలో లైవ్ చూస్తాడట!


అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీగా పర్కార్ వివాహం బుధవారం ముంబైలో జరుగనుండగా, ఈ వేడుకను దావూద్ సోషల్ మీడియా సైట్ 'స్కైపే' ద్వారా లైవ్ లో చూస్తాడని తెలుస్తోంది. దావూద్ చెల్లెలు హసీనా పర్కార్ చిన్న కుమారుడు అలీషా పర్కార్, మెమొన్ వర్గానికి చెందిన అయేషా నగానీని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ వివాహం దక్షిణ ముంబైలోని రసూల్ మసీదులో రేపు ఉదయం జరుగనుండగా, ఆపై సాయంత్రం జుహూలోని తులిప్ స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అలీషా నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News