: ఎంఐఎం కార్పొరేటర్ కు నయీమ్ తో సంబంధం... ముస్తఫా అలీ ఇంట్లో సిట్ సోదాలు


గ్యాంగ్ స్టర్ నయీమ్ పాతబస్తీ కేంద్రంగా పలువురు నేతలతో సంబంధాలు పెట్టుకుని తన నేర చరిత్రను కొనసాగించాడని పసిగట్టిన పోలీసులు, తొలి అడుగును ఎంఐఎం కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజఫర్ పై మోపారు. ముస్తఫా అలీకి నయీమ్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయని, ఎన్నో దందాల్లో ఆయన పాత్ర ఉందని పసిగట్టి, ఆయన ఇంట్లో ఈ ఉదయం నుంచి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. గడచిన గ్రేటర్ ఎన్నికల్లో శాలిబండ డివిజన్ నుంచి ముస్తఫా ఎంఐఎం తరఫున కార్పొరేటర్ గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నుంచే నయీమ్, ముస్తఫాల మధ్య సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల వేళ నయీమ్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడని కూడా సిట్ వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News